Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తులు విప్పి వీడియోలు... జోగిని శ్యామలపై ఎఫ్ఐఆర్...

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (14:34 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన జోగిని శ్యామలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే.. దైవ దర్శనానికి వెళ్లిన తనపై దాడి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని శ్యామలతో పాటు మరో 15 మందిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ మహిళ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
తన దుస్తులు విప్పి.. శ్యామల వీడియోలు తీశారని బాధితురాలు ఆరోపించింది. శ్యామలపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు జోగిని శ్యామలతో పాటు 15మందిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 
సికింద్రాబాద్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న స్రవంతి తన తల్లి తలారి సంధ్య మార్చి 12వ తదీన మెదక్ జిల్లా పాపన్నపేట వన దుర్గాభవానీ దేవాలయ దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారికి జోగిని శ్యామల ఎదురయ్యారు. 
 
తాము ఉంటున్న ప్రదేశానికి రావాలంటూ అభ్యర్థించడంతో తల్లి, కుమార్తె జోగిని నివాసానికి వెళ్లారు. అక్కడ అప్పటికే సుమారు 15 మంది పురుషులు మరో మహిళ ఉండటాన్ని గమనించిన స్రవంతిలోనికి వెళ్లేందుకు సందేహించింది. మరోమారు శ్యామల అభ్యర్థించడంతో లోనికి వెళ్లారు.
 
కాసేపటి తర్వాత శ్యామల.. తన కుటుంబాన్ని దూషించినట్లు బాధితురాలు ఆరోపించింది. తన భర్తని ఉద్దేశించి నీ భర్త పెంపుడు కుక్క అంటూ దూషించారని వాపోయింది. ఇదేమిటని నిలదీయడంతో ఆగ్రహానికి గురైన శ్యామల మరికొంత మంది కలిసి తనపై దాడి చేయడమేకాక, తనను వివస్త్రను చేసి ఫొటోలు వీడియోలు తీశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments