Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం : టీ మంత్రి కేటీఆర్ ధ్వజం

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (12:49 IST)
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మారోమారు మాటల తూటాలు పేల్చారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. ఈయన నామినేషన్ పత్రాలను శుక్రవారం సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 
 
కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం, శని అని, ఈ పార్టీని ఏ పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఇంటింటికి నల్లా ఇవ్వక పోతే ఓట్లు అడగమని చెప్పిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్, అందువల్ల పాలేరులో తుమ్మలను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని అన్నారు. 
 
కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పాలేరులో అదే పార్టీతో కలిసి పోటీ చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పొత్తు దివాళాకోరుతనమని ధ్వజమెత్తారు. అసాధారణ పరిస్థితిలో పాలేరు ఉప ఎన్నిక వచ్చిందనీ, పాలేరులో ఓడిపోతామనే భయంతోనే ప్రతిపక్షాలు చీకటి రాజకీయాలు చేస్తున్నాయనీ, టీడీపీకి నారాయణఖేడ్‌లో లేని సాంప్రదాయం పాలేరులో గుర్తొచ్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments