హైదరాబాదులో అనాధ ఆత్మహత్య, ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:36 IST)
జీవితం ఎంతో చిన్న‌ది. ఇంకెంతో విలువైన‌ది అని తెలిసిన‌ప్ప‌టికీ... చిన్నచిన్న కార‌ణాల‌కే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... హైద్రాబాదుకు చెందిన విజయ్ ఒక అనాధ. క్యాబ్ డ్రైవర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. ఏం క‌ష్టం వ‌చ్చిందో ఏమో కానీ... జీవితం మీద విరక్తి చెందాను అని నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఆత్మహత్య చేసుకునే ముందు అనాధ శవాలను అంత్యక్రియలు నిర్వహించే సంస్థ అయిన సెర్వ్ నీడి గురించి తెలుసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా తాను సంపాదించిన 6000 రూపాయలను సెర్వ్ నీడి సంస్థకు సంబంధించిన‌ వాళ్లకు కలిసి అందజేశాడు. మీకెపుడైన అనాధ శవం దొరికితే ఈ డబ్బులను వినియోగించండి అని 6000 రూపాయలను అందజేసి వెళ్ళిపోయాడు. ఇక తన శవం ఎలాగూ వీళ్లకు దొరుకుతుంది కదా అనేది ఇత‌ని ఆలోచ‌న‌. 
 
ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు ఓ లెట‌ర్ రాసాడు. అందులో త‌న శ‌వాన్ని ఆ సంస్థ వాళ్లకు అప్ప‌చెప్పాల‌ని రాసాడు. అనాధ అయిన తనకు అంత్యక్రియలను వారు నిర్వహిస్తారని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం ఏమిటంటే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని ముందుగానే తెలిసి ఆ సంస్థకు ఏమి చెప్పకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు పంజాగుట్టలో అతడి శవాన్ని స్వాధీనం చేసుకున్న సర్వ్ నీడి సంస్థ అంత్యక్రియలను నిర్వహించింది. ప్ర‌తి స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం ఉంటుంది. అది తెలుసుకుంటే... ఇలా ఎవ‌రూ చేయ‌రు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments