Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి జిల్లాలో ఘోరం... ప్రేమించలేదని యువతిని పొడిచి చంపిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను సమీప భువనగిరి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. వివరాల్లోకి వెళితే...

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (17:38 IST)
ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను సమీప భువనగిరి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. వివరాల్లోకి వెళితే... యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి డిగ్రీ చదువుతోంది. 
 
ఈమె కళాశాలకు వెళ్లే సమయంలో శ్రీకాంత్ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. గత 6 నెలలుగా ఈ వేధింపులు సాగుతుండగా ఈమధ్యనే గాయత్రి తల్లిదండ్రులు అతడికి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కుమార్తె గాయత్రికి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కూడా కుదిరింది. మరో 10 రోజుల్లో నిశ్చితార్థం. 
 
విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు వేసి వున్నా బద్ధలుకొట్టి లోనికి ప్రవేశించాడు. తలుపు చప్పుడు విని విద్యార్థిని సోదరుడు వచ్చేలోపుగానే ఆమెను విచక్షణరహితంగా పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే నేరుగా కత్తితో సహా భువనగిరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా పెళ్లిపీటలెక్కాల్సిన తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని గాయత్రి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments