కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి... కాటికి పంపిన వైద్యులు ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (08:49 IST)
కడపు నొప్పికి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు కాటికి పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విచిత్రమేమింటే.. ఆస్పత్రికి బాగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తికి వైద్యులు వేసిన ఓ ఇంజెక్షన్‌తో కేవలం గంటలోపే సదరు వ్యక్తి చనిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి కడుపునొప్పితో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ప్రాథమిక వైద్యానికి వచ్చాడు. దీంతో వైద్యులు పరీక్షలు చేసి అతడికి ఇంజక్షన్ ఇచ్చారు. కానీ గంటలోపే ఆ వ్యక్తి కదల్లేని పరిస్థితి నెలకొంది. అనంతరం అతడు నొప్పితోనే చనిపోయాడు.
 
అయితే డాక్టర్లు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 
 
సీసీ ఫుటేజీ విడుదల చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments