కరోనా కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వర పుణ్యక్షేత్రం!

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (12:13 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒకటి. 
 
ఈ జిల్లాలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్‌ అమలుతో కేసులు కొద్దిగా అదుపులోకి వచ్చినప్పటికీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికంగా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా అధికారులు ప్రకటిస్తున్నారు.
 
ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో గ్రామాన్నికంటైన్మెంట్ జోనుగా ప్రకటించారు. కాళేశ్వరం వచ్చే వాహనాలను మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ వద్ద నుండి వెనక్కి పుంపిస్తున్నారు. కాలేశ్వరం ఆలయానికి కూడా భక్తులను అనుమతించడం లేదు. 
 
మహదేవపూర్ మండలం బొమ్మ పూర్ క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాళేశ్వరం ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో, కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా కేసులు తగ్గే వరకు కాళేశ్వరం ఆలయానికి భక్తులెవరూ రావొద్దని పోలీసులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments