Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో నగ్నంగా బైక్‌పై యువకుడు.. వీడియోలు వైరల్

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (10:40 IST)
Bike ride
హైదరాబాదులో షాకింగ్ ఫుటేజీ చర్చకు దారితీసింది. పోలీసులు అప్పుడప్పుడూ కెమెరా ఫుటేజీలను గమనిస్తూ వుంటారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ యువకుడు నగ్నంగా బైక్‌పై సంచరిస్తూ కనిపించాడు. ఇప్పటికే అతడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి అది నిజమో కాదో నిర్ధారించుకునేందుకు.. సీసీ ఫుటేజీలను పరిశీలించారు పోలీసులు. అప్పుడే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి ప్రాంతంలో ఓ యువకుడు నగ్నంగా బైక్ నడిపాడు. మారేడ్‌పల్లి నుంచి నేరెడ్‌మెంట్ రూట్‌లో శరీరంపై బట్టలు లేకుండా సంచరించడంతో స్థానికులు షాక్ తిన్నారు. ఈ వ్యవహారంపై ఇన్‌స్పెక్టర్ శ్రవణ్ కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మతిస్థిమితం లేని ఓ యువకుడు లంగర్‌హౌస్ ప్రాంతంలో ఓ బైక్‌ను చోరీచేశాడు.
 
ఆ బైక్‌పై లంగర్‌హౌస్ నుంచి తిరుమల వైపు వచ్చాడు. ఆర్మీ రోడ్లపై నగ్నంగా తిరుగుతూ హల్‌చల్ చేశాడు. అనంతరం అదే బైక్‌పై సనత్‌నగర్ వైపు వెళ్లాడు. ఎవరూ లేని చోటు చూసి.. అక్కడే బైక్ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అతడు ఎందుకిలా చేశాడన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. మతిస్థిమితం లేకపోవడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం