త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:09 IST)
త్వరలో  తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.  సిద్దిపేటలో నిర్మించిన నూతన మోడల్‌ గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 34వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ గ్రంథాలయ భవనంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇక్కడ మహిళల కోసం వనిత, చిన్నారుల కోసం కామిక్స్‌, ఉర్దూ పుస్తకాల కోసం ప్రత్యేక రూములు, డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని రకాల పోటీ  పరీక్షల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయని, యువత వీటిని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించాలన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త  ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments