నిధుల లేమి... మాంసం ముక్క కోసం తల్లడిల్లిపోతున్న ఖైదీలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (11:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కేంద్ర కారాగారాల్లో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు చికెన్, మటన్ బంద్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ జైళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టరుకు తెలంగాణ జైళ్ల శాఖ రూ.2 కోట్ల మేరకు బాకీ పడిందట. దీంతో ఈ సొమ్ము చెల్లిస్తే గానీ, తాను మాంసం సరఫరా చేయలేనని కాంట్రాక్టర్ మొండికేశారు. దీంతో ఈ రెండు జైళ్లలోని ఖైదీలు చికెన్, మటన్ ముక్కలేక తల్లడిల్లిపోతున్నారు. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది. 
 
ఈ రెండు జైళ్ల నిర్వహణకు నిధుల లేమి ఉత్పన్నమైంది. దీంతో రెండు వారాలుగా ఖైదీలకు చికెన్, మటన్ నిలిపివేశారు. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ.2 కోట్ల మేరకు బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఖైదీలకు మొదటి ఆదివారం మటన్, మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. ఇపుడు నిధుల లేమితో జైళ్లలో మాంసాహారాన్ని నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments