మాదన్నపేట మండి... చినుకు పడితే చిత్తడి

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (15:31 IST)
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద కూరగాయల మార్కెట్‌లలో ఒకటైన మాదన్నపేట మండి చినుకుపడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. చిన్నపాటి వర్షానికే మార్కెట్‌లో అడుగు తీసి అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. శివారులోని రంగారెడ్డి జిల్లా నుండి సుమారు 30 గ్రామాలకు చెందిన వందలాది రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు మాదన్నపేట మండికి చేరుకుంటారు.
 
నిత్యం వేల సంఖ్యలో వినియోగదారులు ఈ మండికి కొనుగోళ్ల కోసం వస్తారు. రైతులు, వినియోగదారుల రాకపోకలతో మాదన్నపేట మండి నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షానికి మండి ఆవరణ మురుగు జలాశయంలా మారింది. మార్కెట్లో వర్షం నీరు బయటికి వెళ్ళే మార్గం లేక మండి మొత్తం బురదమయంగా మారింది. మార్కెట్ లోకి వెళ్లివచ్చే వీలులేక వినియోగదారులు తగ్గిపోయారు. 
 
కానీ కష్టించి పండించిన పంటను వర్షంలోనూ వ్యయప్రయాసలకు ఓర్చి మాదన్నపేట మండికి తీసుకువస్తే కొనేవారు లేక విలువైన పంటను వర్షం నీరు, బురదలోనే పడేసి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండిలో అమ్మకం పన్నులు చెల్లిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించరా అని మార్కెటింగ్ అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిహెచ్ ఎంసీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు స్పందించి మాదన్నపేట మండి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranveer Singh: అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలో రణవీర్ సింగ్ కు అభిమానం వెల్లువెత్తింది

కన్నడ చిత్రం రాక్షసపురం కు కె.ఎస్. రామారావు సపోర్ట్

Raghu Kunche: రఘుకుంచె గేదెలరాజు రిలీజ్ డేట్ మారింది

Niharika: ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా : నిహారిక కొణిదెల

Arya: ఆర్యా, పోలూరు కృష్ణ కాంబినేషన్ టైటిల్ రంజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments