Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్‌ లేకుంటే నో ఎంట్రీ, అయినా వీళ్లు మారరా?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (20:38 IST)
సైబరాబాద్‌ పరిధిలో రోడ్డు భద్రత కోసం తొలిసారిగా చెక్‌ పోస్టులను నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర హైవే లపై హెల్మెట్‌ లేని వారికి ఎంట్రీ లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
 
ఈ నేపథ్యం రాజీవ్‌ రహదారి, ఎన్‌హెచ్‌ 44, ఎన్‌హెచ్‌ -65 రహదారులు, శంషాబాద్‌, షాద్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక రోడ్డు భద్రత చెక్‌ పోస్టులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి హెల్మెట్‌ ధరించే వరకు వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
 
ఎలాంటి జరిమానాలు, ఈ-చలాన్లు ఇవ్వడం లేదు. హెల్మెట్‌ ధరించిన తర్వాతనే రోడ్డుపై అనుమతి ఇస్తున్నారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనంపై ఉండే పిలియన్‌ రైడర్‌ (వెనకాల కూర్చున్న వ్యక్తి) కూడా హెల్మెట్‌ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. 
 
దీంతో చెక్‌ పాయింట్‌ వద్ద వాహన దారులను అర్ధాంతరంగా నిలిపి వేయడంతో వారు కొంత అసహనానికి గురవుతున్నారు. అయినప్పటికీ ఆ తర్వాత హెల్మెట్‌లు ధరించి వాహనాలను నడిపిస్తుండటం కొంత మానసిక ధైర్యాన్ని కల్పిస్తుందని వాహన దారులు పోలీసులకు వివరిస్తున్నారు. 
 
ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలనే లక్ష్యంగా కొత్త సంవత్సరంలో ఈ ప్రక్రియను అవలంభిస్తున్నామని డీసీపీ ఎస్‌ఎం విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు, మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments