Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందిచ్చి ముంచేశారు... పెళ్లిలో వధువు నగల బ్యాగ్ చోరీ!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (08:41 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బార్దిపూర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో చోరులు తన చేతివాటాన్ని ప్రదర్శించారు. వధువు నగల బ్యాగుతో ఉన్న మహిళకు మత్తు మందు ఇచ్చి, మాటల్లో దించి ముంచేశారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నగల బ్యాగుతో ఉడాయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డిచ్‌పల్లి మండలం బార్డిపూర్ శివారులోని ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఓ వివాహం జరిగింది. వివాహానికి బంధువులు తెచ్చిన బంగారం, గిఫ్టులు భారీగానే వచ్చాయి. ఇందులో విలువైన ఆభరణాలను మాత్రం ఓ మహిళ తన బ్యాగులో భద్రపరిచింది. ఈ విషయాన్ని గ్రహించిన చోరులు.. ఆమెకు మత్తు ఇంజిక్షన్ ఆమె వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. 
 
మత్తునుంచి తేరుకున్న మహిళా.. విషయాన్ని బంధువులకు చెప్పండంతో ఫంక్షన్ హాల్ మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇద్దరు యువకులు బ్యాగ్ ఎత్తుకెళ్లినట్టు తేలింది. బ్యాగ్‌లో 35 తులాల బంగారు ఆభరాణాలు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments