Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం - 9 మందికి గాయాలు

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (08:53 IST)
హైదరాబాద్ నగరంలో పెను ప్రమాదం తప్పింది. సాగర్ రింగ్ రోడ్డు కూడలిలో చేపట్టిన ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్‌ ఏర్పాటు చేస్తుండగా అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలు కాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైరామల్ గూడూ వైపు నుంచి ఫ్లైఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్ కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో గాయపడిన కార్మికులంతా బిహార్‌కు చెందిన వారు. 
 
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేజర్‌ ప్రాజెక్టు అధికారులు చేరుకుని పరిశీలించారు. పొక్లెయిన్‌ సాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments