Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారం రోజుల పసికందును రూ.3వేలకు అమ్మేసిన కన్నతల్లి!

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (17:13 IST)
ముక్కుపచ్చలారని ఆ పసికందును దారుణంగా మూడు వేల రూపాయలకు బేరం పెట్టింది ఓ కన్నతల్లి. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో వెలుగు చూసింది. రాధ అనే మహిళ తన భర్తతో కలిసి స్థానికంగా ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు.
 
కూలీపని చేసుకుంటూ బ్రతికే ఈ దంపతులకు ఏడు రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏమైందో ఏమో కానీ భూమి మీదపడిన మూడు రోజులకే చిన్నారిని స్థానికంగా ఉన్న శాంతమ్మ అనే మహిళకు రూ.3 వేలకు విక్రయించింది. ఆ తర్వాత మరో మూడు రోజులకు మళ్ళీ తన బిడ్డ తనకు కావాలని చిన్నారిని కొనుకున్న మహిళా వద్దకు వెళ్లి తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని కోరింది.
 
కానీ అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు. కన్న తల్లి బ్రతిమాలడంతో పదివేల రూపాయలిస్తే బిడ్డను తిరిగిచ్చేస్తాని చెప్పింది. దీంతో అంత డబ్బు ఇవ్వలేని ఆ తల్లి దిక్కు తోచని స్థితిలో రాధ స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ను ఆశ్రయించింది. అంగన్‌వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు శిశువును సంరక్షణలోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments