Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు 'అన్నయ్య' దెబ్బకు హైదరాబాద్ 'తమ్ముడు' దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (15:21 IST)
ఒకరు ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్. ఇంకొకరు తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు కె.తారక రామారావు. వీరిద్దరూ గ్రేటర్ ఎన్నికల పర్యటనలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. టి.సీఎం కుమారుడు కేటీఆర్ ఎన్నికల పర్యటన సమయంలో ఓ మాట అన్నారు. లోకేష్ తెలంగాణ గెస్ట్ అని అనేసరికి... నేను పుట్టింది హైదరాబాద్, పెరిగింది హైదరాబాద్, చదువుకున్నదీ హైదరాబాదే కాబట్టి అచ్చమైన తెలంగాణ బిడ్డను నేనే అంటూ నారా లోకేష్ రివర్స్ అటాక్ చేశారు. 
 
అంతేకాదు.. అన్నయ్య కేటీఆర్... నువ్వు చదువుకుంది గుంటూరు జిల్లాలో అంటూ వ్యాఖ్యానించి మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నించారు. ఐతే లోకేశ్ వ్యాఖ్యల్ని తిప్పి కొట్టే క్రమంలో కేటీఆర్ లోకేష్ తమ్ముడూ... తెలంగాణలోనే పోటీ చేస్తావా? అని ప్రశ్నించేసరికి లోకేష్ బదులివ్వకుండా సైలెంట్ అయిపోయారు. ఐతే గ్రేటర్ ఎన్నికల పర్యటనలో కేటీఆర్ తన ప్రసంగాలతో ఆకట్టుకున్న స్థాయిలో లోకేష్ ఓటర్లను ఆకట్టుకోలేకపోయారంటూ సర్వేలు కూడా వచ్చాయి. 
 
నారా లోకేష్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారనీ, ఆయన తను చేసే ప్రసంగంలో ఇంకా రాటుదేలాల్సి ఉంటుందని అంటున్నారు. ఏదైతేనేం హైదరాబాద్ ప్రజలు ఈసారికి కారు ఎక్కేశారు. సైకిల్, హస్తం, కమలం అన్నీ చిత్తుచిత్తయ్యాయి.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments