Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాద చిన్నారుల మృతులపై స్పష్టత ఇవ్వని అధికారులు!

Webdunia
గురువారం, 24 జులై 2014 (15:03 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో గురువారం ఉదయం స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదంలో... ఎంతమంది చిన్నారులు మరణించారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు 13 మంది పిల్లలు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఘటనా స్థలం నుంచి అందిన సమాచారం మేరకు 20 మంది చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. 
 
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరికొంతమంది తుదిశ్వాస విడిచారు. మరో 23 మంది పిల్లలు సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత బస్సులో 30 మంది చిన్నారులున్నారని వార్తలొచ్చాయి. కానీ, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో 40 మందికి పైగా పిల్లలున్నట్లు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడటంతో... సంతాప సూచకంగా సెలవు ప్రకటించినట్టు డీఈవో తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని... స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments