Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి హరికృష్ణ తనయకు కూకట్‌పల్లి సీటు.. 17న నామినేషన్

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:16 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేయనున్నారు. ఈమెకు కూకట్‌పల్లి టిక్కెట్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేటాయించారు. 
 
నిజానికి ఈ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసే అంశంపై రెండు రోజుల పాటు తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈనేపథ్యంలో గురువారం చంద్రబాబును వైజాగ్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు టిక్కెట్ ఖరారు చేశారు. సుహాసిని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ఆ సెగ్మెంట్‌కు చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. దీంతో శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
కాగా, హరికృష్ణ కుమార్తె సుహాసిని తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ సతీమణి. పిల్లల చదువుల కోసం సుహాసిని హైదరాబాద్ నగరంలో కొన్నేళ్లుగా స్థిరపడిపోయారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఆమెకు పార్టీ టిక్కెట్ కేటాయించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments