ఆంధ్రా అధికారివి... నీయయ్య.... నాకే ఎదురు చెప్తావా? : తెరాస ఎమ్మెల్యే బూతుపురాణం

తెలంగాణ రాష్ట్రంలో మరోమారు ఆంధ్రా అధికారిపై అధికార తెరాస ఎమ్మెల్యే ఒకరు బూతు పురాణం లంఘించారు. "ఆంధ్రా అధికారివి... నీయయ్య నాకే ఎదురొస్తావా?" అంటూ పరుషపదజాలంతో దూషించారు.

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (11:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరోమారు ఆంధ్రా అధికారిపై అధికార తెరాస ఎమ్మెల్యే ఒకరు బూతు పురాణం లంఘించారు. "ఆంధ్రా అధికారివి... నీయయ్య నాకే ఎదురొస్తావా?" అంటూ పరుషపదజాలంతో దూషించారు. ఈ ఎమ్మెల్యే బూతుపురాణానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ అయింది. ఆమె తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్‌కు వేముల వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని సీఈవో సమాధానం ఇస్తుండగానే, "నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి" అంటూ నోరు జారడంతో పాటు రాయడానికి వీల్లేని బూతులు తిట్టాడు. అడిగిన పని చేయకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, వీరేశం వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
కాగా, గతంలో ఓ కాలేజీ యజమానిని చంపుతానని హెచ్చరించి, దాని ఆడియో బయటకు రావడంతో మార్ఫింగ్ చేశారని ఎదురు ఆరోపణలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం మరో వివాదంలో చిక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments