Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తుగ్లక్ పాలనలా కేసీఆర్ రూలింగ్ : నాగం జనార్ధన్ రెడ్డి

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (15:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన సాగుతోందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఓ పిచ్చి తుగ్లక్‌ల్ వ్యవహరిస్తూ పాలన చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపును అడ్డుకుని తీరుతామన్నారు.
 
సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు పిచ్చి ఆలోచనతో సమానమన్నారు. సచివాలయాన్ని తరలించి ఆకాశ హర్మ్యాలు కడితే పెట్టుబడులు వస్తాయని కేసీఆర్ భ్రమపడుతున్నారని నాగం విమర్శించారు. ఛాతి ఆస్పత్రి తరలింపుపై అఖిలపక్ష భేటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు.. హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేర్చాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి క్షయ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments