Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత పదవి ఇచ్చేవారే.. అడగలేదు, ఇప్పుడు కెసిఆర్‌ పార్టీలో చేరుతున్నా: 'ముత్యాలముగ్గు' సంగీత

'ముత్యాలముగ్గు' సినిమాతో గుర్తింపు పొందిన నటి సంగీత. 100 సినిమాలు కథానాయికగా నటించిన ఆమె దక్షిణాదిలోని అన్ని భాషల్లో 400 పైగా చిత్రాల్లో నటించింది. అయితే.. చెన్నైలో సెటిల్‌ కావడంతో తెలుగులో సింహాద్రి తర్వాత పెద్దగా చిత్రాలు చేయలేదు. కాగా, తెలుగు రాష్

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (18:22 IST)
'ముత్యాలముగ్గు' సినిమాతో గుర్తింపు పొందిన నటి సంగీత. 100 సినిమాలు కథానాయికగా నటించిన ఆమె దక్షిణాదిలోని అన్ని భాషల్లో 400 పైగా చిత్రాల్లో నటించింది. అయితే.. చెన్నైలో సెటిల్‌ కావడంతో తెలుగులో సింహాద్రి తర్వాత పెద్దగా చిత్రాలు చేయలేదు. కాగా, తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయంలోనే.. కెసిఆర్‌ నుంచి తనకు ఆఫర్‌ వచ్చిందనీ, చెన్నైలో వుండటం వల్ల సాధ్యపడలేదని సంగీత తెలియజేస్తుంది. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో అమీర్‌పేటకు మకాం మార్చినట్లు శనివారం నాడు మీడియాకు వివరించింది. నా వయసుకు తగ్గ పాత్రలు చేయడానికి నేను సిద్ధం అంటున్నారు సంగీత. 
 
నా స్వస్థలం వరంగల్‌. తెలుగులో నేను నటించిన చిత్రం 'తీర్పు', కానీ విడుదలైన చిత్రం మాత్రం 'ముత్యాలముగ్గు'. విశ్వేశ్వర్‌రావు గారు, బాపుగారు వంటి వారి అండతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చాను. వారి ఆశీర్వాదంతో మంచి నటిగా గుర్తింపు కూడా సంపాదించుకున్నాను. ఇప్పటికి నేను సినిమా రంగంలోకి ప్రవేశించి నాలుగు దశాబ్దాలవుతుంది. 
 
ఇంకా సినిమా రంగంలోనే కొనసాగాలనుకుంటున్నాను. అయితే సీరియస్‌ పాత్రలే కాకుండా జోవియల్‌గా ఉండే అమ్మ తరహా పాత్రలు.. అంటే గతంలో ఇడియట్‌ చిత్రంలో చేసిన తరహాతో పాటు అన్నీ రకాల పాత్రల్లో నటించాలనుకుంటున్నాను. తెలుగులో 200 సినిమాలు, అందులో వందకు పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. 
 
అలాగే నేను చెన్నైలో ఉన్నప్పుడు నన్ను రాజకీయాల్లోకి రమ్మని కూడా ఆహ్వానించారు. జయలలితను కలిస్తే ఏదో పదవి ఇచ్చేది. కానీ నాకు ఇష్టంలేదు. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాను కాబట్టి టి.ఆర్‌.ఎస్‌. పార్టీలో చేరాలనుకుంటున్నాను. సినిమాకు సంబంధించి ప్రభుత్వం వారు ఏదైనా బాధ్యత అప్పగించినా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. గతంలో ఈ విషయమై కెసిఆర్‌తో ప్రస్తావించాననీ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ గారి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. త్వరలోనే ఆయన్ను కలిసిన నా నిర్ణయం ఆయనకు తెలియజేస్తాను'' అన్నారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments