గుడిసెలో ఎంపిటిసి, పెళ్ళయిన మహిళలతో రొమాన్స్ చేస్తూ...

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (21:58 IST)
బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తి అతను. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు. ఎవరైనా చెడు మార్గంలో నడుస్తుంటే వారికి మంచి మాటలు చెప్పాలి. అలాంటి వ్యక్తి పెళ్ళయిన ఆంటీలనే టార్గెట్ చేసుకుని వారిని లోబరుచుకుని ఎంజాయ్ చేసేవాడు. వారికి డబ్బుల ఆశ చూపించి వారితో శారీరక సంబంధాన్ని పెట్టుకునేవాడు. ఎన్నో రోజులు ఆ సంబంధం కొనసాగదుగా.. అడ్డంగా దొరికిపోయాడు.
 
తెలంగాణా రాష్ట్రం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ఉండే ఎంపిటీసీ స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. వివాహమై భర్తలకు దూరంగా ఉండే వివాహితులతోను, అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు దగ్గరవుతూ ఉండటం ఇతనికి ఉన్న అలవాటు. 
 
వారికి డబ్బులు ఆశ చూపించి.. లేకుంటే ప్రభుత్వ పథకాలు వచ్చేలా చేస్తానంటూ హామీలను ఇస్తూ వారికి దగ్గరవుతూ ఉంటాడు. ఇలా మొత్తం ఐదుగురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఊరి పొలాల్లోనే తన పని కానిచ్చేవాడు ఎంపిటీసీ. 
 
అంతేకాదు పశువులను కట్టే ప్రాంతంలోను, గొర్రెలు తిరిగే ప్రాంతంలోనే శృంగారం చేసేవాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతూ ఉండేవాడు. అయితే ఎక్కువ రోజులు ఆ విషయం దాగదుగా. ఒక పశువుల కాపరికి ఎంపిటీసీ అడ్డంగా దొరికాడు. 
 
ఎంపిటీసీ లీలలను సెల్ ఫోన్లో తీసిన ఆ పశువుల కాపరి ఊరి మొత్తానికి ఆయన బాగోతాన్ని చూపించేశాడు. దీంతో అసలు విషయం ఎంపిటిసి తెలియడమే కాదు తాను మోసం చేస్తూ లోబరుచుకుంటున్న మహిళలకు బయటకు వచ్చి అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి కటాకటాల పాలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments