Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల బాధతో తల్లి మృతి.. మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య!

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (14:53 IST)
అప్పుల బాధ భరించలేక తన తల్లి మృతి చెందడాన్ని భరించలేని ఓ కుమారుడు.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ వెంకటతండాకు చెందిన భూక్య చాంది (46) అనే మహిళకు రవి అనే కుమారుడున్నాడు. అప్పుల బాధను భరించలేక ఆమె రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. 
 
తల్లి మరణాంతరం రవి తీవ్రంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్ను మూశాడు. మృతుడికి భార్య రోజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబమంతా విషాదంతో మునిగిపోయింది. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments