Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పందన చెప్పినట్టుగా సూసైడ్ చేసుకోలేదు.. ఇంటికి చేరింది!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (12:16 IST)
అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఆచార్య జయశంకర్‌ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్పందన భట్‌ ఆచూకీ లభ్యమైంది. కాటేదాన్‌లోని తన నివాసానికి స్పందన క్షేమంగా చేరింది. ఆమె మహారాష్ట్ర వెళ్లివచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం ఇంట్లో సూసైడ్‌ నోట్‌ పెట్టి స్పందన అదృశ్యమైన విషయం తెల్సిందే. దీంతో ఆమె ఆచూకీపై కలకలం రేగింది. ఈ నేపథ్యంలో.. ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకోవడం గమనార్హం. 
 
బుధవారం ఉదయం విధులకు వెళ్లిన స్పందన తన తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పి, అదే విషయాన్ని డైరీలో రాసి అదృశ్యమైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం క్లిష్టతరం అయింది. భర్త ప్రవర్తన పట్ల విసుగు చెందిన ఆమె మనస్తాపంతో సూసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యమైనట్టు సమాచారం. చివరికి ఆమె క్షేమంగా ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments