Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని మహిళను కూడా వదలరా? రెండుసార్లు తల్లి అయ్యింది..

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (10:25 IST)
మహిళలపై అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మతిస్థితిమితం లేని మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు. తాజాగా మతిస్థిమితం లేని ఓ మహిళపై లైంగిక దాడి చేసి బిడ్డకు తల్లిని చేసిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో వెలుగుచూసింది. అది కూడా మూడోసారి కావడం సమాజంలో పరిస్థితులు ఎలా వున్నాయో తెలుసుకోవచ్చు.
 
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో ఓ మహిల చిచ్చమెత్తుతూ రోడ్లపైనే జీవనం సాగిస్తుంది. ఆమె తల్లిదండ్రులు చనిపోగా.. అన్న ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మతిస్థిమితం కోల్పోయింది. అయితే అలాంటి మహిళకు కొందరు మృగాళ్లు పాడు బుద్దిని ప్రదర్శించారు. ఆమెపై లైంగికదాడులకు పాల్పడి ఇప్పటికే రెండుసార్లు తల్లిని చేశారు. తాజాగా ఆదివారం బస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌బంకు వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమె పురిటి నొప్పులతో బాధపడటం గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం అందించారు.
 
దీంతో అక్కడికి చేరుకున్న ప్రభుత్వ వైద్యురాలు ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన తర్వాత ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక, ఆ బిడ్డను తమ ఆధీనంలోకి తీసుకున్న అంగన్‌వాడీ సిబ్బంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని చైల్డ్ కేర్ హోమ్‌కు అప్పగించారు. గతంలో ఆ మహిళకు జన్మించిన ఇద్దరు బిడ్డలను కూడా అక్కడికే తరలించినట్టుగా తెలిసింది. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధిత మహిళకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం