Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీకి వెళుతున్నాని వ్యవసాయ బావిలో శవమై తేలిన మెడికో

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (18:02 IST)
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామనికి చెందిన ఓ మెడికో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కనుపర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి వంశీ కాలేజీకి వెళుతున్నానంటూ శుక్రవారం బయటకు వెళ్లిన వ్యక్తి స్వంత వ్యవసాయ బావిలో శనివారం శవమై  కనిపించాడు. కాళ్ళూ చేతులు తాళ్లతో కట్టి వేసి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
 
వివరాలు చూస్తే... తుమ్మనపల్లి తిరుపతి - రమా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న కుమారుడైన వంశీ (22) ఖమ్మం జిల్లా మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన వంశీ శుక్రవారం సాయంత్రం ఖమ్మం బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. కానీ శనివారం గ్రామ శివారులోని వారి సొంత వ్యవసాయ భూమిలో శవమై తేలాడు. 
 
ఉదయం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులకు బావిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా బోరున విలపించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం గ్రామంలో ఉన్న సిసి ఫుటేజీలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పరకాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments