తాగిన మైకంలో యువకుడికి తాళి కట్టిన యువకుడు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (07:29 IST)
మెదక్ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. తాగిన మైకంలో ఓ యువకుడి మరో యువకుడు తాళి కట్టాడు. ఆ తర్వాత తాళి కట్టించుకున్న యువకుడు కాపురానికి వెళ్లాడు. దీంతో ఆ గ్రామస్థులంతా ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 యేళ్ళ యువకుడికి మెదక్ జిల్లా చిలప్‌చేడ్ మండలం చుండూరుకు చెందిన 22 యేళ్ల ఆటో డ్రైవర్‌తో ఓ కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఈ నెల ఒకటో తేదీన తాగిన మైకంలో చండూరు యువకుడితో జోగిపేట యువకుడు తాళి కట్టించుకున్నాడు. అక్కడి వరకు అంతా బాగానేవుంది. అస్సలు కథ అక్కడ నుంచే మొదలైంది. 
 
తాను కాపురానికి వచ్చానంటూ తాళి కట్టించుకున్న యువకుడు దానిని కట్టిన యువకుడి ఇంటికి కావడంతో అంతా ఒక్కసారి షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వచ్చిన యువకుడిని తాళి కట్టిన యువకుడి తల్లిదండ్రులు మందలించి పంపేశారు. దీంతో అతడు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీన్ ఠాణాకు మారింది. 
 
గ్రామపెద్దలు, ఇద్దరు యువకులు కుటుంబ సభ్యులను పిలిచి పోలీసులు పంచాయితీ పెట్టారు. అయితే, లక్ష రూపాయలు ఇస్తే కేసు వాపసు తీసుకుంటానని తాళి కట్టించుకున్న యువకుడు మొండిపట్టుపట్టాడు. చివరకి అతడిని ఎలాగోలా ఒప్పించి రూ.10 వేలు ఇచ్చేందుకు సమ్మతించారు. దీంతో కేసు వాపసు తీసుకోవడంతో అంతరా ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments