Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి .. నిర్భయ చట్టం కింద బుక్కయ్యాడు!

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (18:35 IST)
హైదరాబాద్‌లో పోకిరి.. మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీసి జైలుపాలయ్యాడు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో గల సయ్యద్‌నగర్‌లో రవూఫ్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మంగళవారం అతను బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఓ అపార్టుమెంటులో పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అదే అపార్టుమెంటులోని ఒక బాత్రూమ్‌లో ఓ మహిళ స్నానం చేస్తుండగా, రవూఫ్ దొంగచాటుగా తన సెల్ ద్వారా చిత్రీకరించాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన ఆ మహిళ చూసీచూడనట్టుగా బయటకు వచ్చి... మరో మహిళ సాయంతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. ఆ సమయంలో దాన్ని గమనించి రవూఫ్ పరారయ్యాడు. ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments