Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:20 IST)
అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది. ఇదేంటి.. పానీ పూరీ తినడం వల్ల ప్రాణం పోయిందా అనుకునేరు. కాదు.. పానీపూరి బండి వద్ద జరిగిన గొడవలో గాజు గ్లాసు పగిలి ఓ వ్యక్తి చేతికి తీవ్రంగా గాయమైంది. ఆస్పత్రికి తరలించే లోపు ఏకధాటిగా రక్తం కారడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఠానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పహాడీషరీఫ్ తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్ (28) బుధవారం రాత్రి పది గంటలకు.. మద్యం మత్తులో బైకును నడిపాడు. ఈ బైకు కాస్త చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లింది. మద్యం మత్తులో వున్న వ్యక్తి.. పానీపూరీ కావాలని అడగడంతో ఆ పానీపూరీ అమ్మేవాడు లేదని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ అతనితో ఘర్షణకు దిగాడు. ఇదేంటని అక్కడే వున్నయాదయ్య అనే వ్యక్తి.. వారిద్దరి గొడవను ఆపాలని చూశాడు. 
 
ఆవేశంలో పానీపూరి బండిపై వున్న గాజుపై గట్టిగా శ్రీనివాస్ బాదాడు. దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్‌ కుడిచేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది. గాజు ముక్కలు గాయంలో బాగా ఇరుక్కుపోవడంతో రక్తం ధారలా కారింది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే చాలా రక్తంపోవడంతో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments