Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 కోట్ల నగదు స్వాధీనం : ఐటీ అధికారులు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (07:43 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు నివాసాల్లో జరిపిన ఆదాయ పన్ను శాఖ అధికారులు రెండు రోజుల పాటు జరిపిన సోదాల్లో దాదాపు రూ.ఆరు కోట్ల మేరకు నగదు లభించిందని ఐటీ అధికారులు వెల్లడించారు. అలాగే, మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. 
 
గత హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 400 మంది అదికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ఈ సోదాలు ముగియగా, మరికొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి. 
 
ఈ సోదాలపై ఐటీ అధికారులు స్పందిస్తూ, మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించాయమన్నారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యా సంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేసినట్టు గుర్తించినట్టు తెలిపారు. 
 
అలాగే, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించారని, అలాగే, మల్లారెడ్డి - నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చిస్తున్నట్టు చెప్పారు. 
 
మరోవైపు, ఈ ఐటీ సోదాలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ సోదాల వల్ల తమకెలాంటి నష్టం లేదన్నారు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రులు, కళాశాలలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వాటి ఆస్తుల వివరాలను అధికారులకు అందజేశామని, అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments