Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల దాడులపై స్పందిస్తే వ్యభిచారిణిగా ముద్రవేస్తారా? ఎవరు?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (08:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఇప్పటికే వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడులను విపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అలాగే, బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత కూడా ఖండించారు. ఆలయాలపై దాడులను ఖండిస్తూ, ప్రభుత్వంపై ఆమె ఘాటైన విమర్శలే చేశారు. దీంతో ఆమెపై వైకాపా నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై, తనపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
"ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించినందుకు వ్యభిచారిణిగా, తిరుగుబోతుగా ముద్రవేస్తారా? ఇంత దారుణంగా వేధిస్తారా? నాపై వ్యక్తిగత విమర్శలకు దిగి, ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తెస్తే.. ఎవరినైనా సరే చంపేస్తా" అని మాధవీలత హెచ్చరించారు. 
 
సోషల్‌ మీడియాలో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అశ్లీల పోస్టులు పెట్టి, అసభ్యకర రాతలు రాసి ట్రోల్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విజయ్‌ మహరాజ్‌ అనే వ్యక్తి నన్ను టార్గెట్‌ చేసి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు, మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు. నన్ను అసభ్యకరంగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ధర్నా చేస్తా అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments