Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (22:46 IST)
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోకి ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది.
 
వాతావరణంలో మార్పుల వల్ల ఈ నెల 29 వరకు రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
 
రాగల 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్‌లో ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నది.
 
రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, ఖమ్మం పట్టణంలో అత్యధికంగా 34.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments