Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (08:16 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. బుధవారం ఉదయంలోగా వాయుగుండం మారే అవకాశాలు ఉన్నాయని గోపాల్ పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ విపత్తు ప్రభావం 30వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఉంటుందని, రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. 
 
దీని ప్రభావం కారణంగా తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కడలి కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదన్న హెచ్చరికలు జారీచేశారు. గడిచిన 24 గంటల్లో దక్షిణ ఒడిశా అంతటా ఆగాగి వర్షాలు కురిశాయి. కొరాపుట్‌ జిల్లా కొట్పాడ్‌లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. 
 
గజపతి జిల్లా గుసానిలో 6, కాశీనగర్‌లో 5, గంజాం జిల్లా సురడలో 5, గజపతి జిల్లా పర్లాఖెముండిలో 4, కొంధమాల్‌ జిల్లా ఖజరియాపదలో 4, మయూర్‌భంజ్‌ జిల్లా రరునాలో 4, ఇతర కేంద్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వాన కురిసిందన్నారు. బుధవారం మల్కాన్‌గిరి, కొరాపుట్‌, గజపతి, గంజాం జిల్లాల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉన్నందున 'ఆరెంజ్‌' హెచ్చరికలు చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments