Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 28న కాంగ్రెస్ ఆన్‌లైన్ పోరాటం, దేనిపైన?

Webdunia
బుధవారం, 27 మే 2020 (18:54 IST)
కాంగ్రెస్ పార్టీ 50 లక్షల మంది నాయకులు సామాజిక మాధ్యమాల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. కరోనా వలన పేదలు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలిసిందే. పేదలను ఆదుకోవాలి అంటూ... ప్రతి పేద కుటుంబానికి రూ. 10,000 నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అలాగే చిన్న కార్మికులు, చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్ లైన్ పోరాటం చేయనుంది.
 
ఏఐసీసీ ఆదేశాల మేరకు 28వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాంగ్రెస్ నాయకులు సామాజిక మద్యమలలో కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆయన ఫేస్ బుక్ లైవ్ ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. 
 
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు వలస కార్మికులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవాలని అన్నారు.
 
కాంగ్రెస్ నాయకులు 28వ తేదీన వారికి అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమంలో ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ ద్వారా స్వయంగా వీడియో చేసి పోస్ట్ చేయాలని సూచించారు. ఇది నాయకులు కచ్చితంగా పాటించాలని, దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది ఈ ఆన్ లైన్ పోరాటంలో పాల్గొంటున్నారని అన్నారు. తెలంగాణలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 10 వేల మంది కార్యకర్తలు వారి వారి సామాజిక మాధ్యమలలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వీడియో చేసి పోస్ట్ చేయాలని అన్నారు.
 
ప్రధానంగా మూడు డిమాండ్లతో ఈ సామాజిక మాధ్యమ పోరాటానికి పూనుకున్నామని దేశంలోని ఆదాయ పన్ను పరిధిలో లేని  పేదలందరికి నేరుగా 10 వేల రూపాయలు అందించాలని అలాగే చిన్న వ్యాపారులను, దినసరి వేతనంతో పని చేసే వారిని, రోజు వారీ వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవాలని, వలస కార్మికుల అన్ని రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు. ఇందులో ప్రతి కార్యకర్త పాల్గొనాలని లక్డౌన్లో ప్రజలు పడుతున్న కష్టాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చేలా మన పోరాటం ఉంటుందని సూచించారు. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ!

Dr. Mohanbabu: మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతం విడుదల

Balakrishna: బాలకృష్ణ నటించిన టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 రీ రిలీజ్

Sushanth: రెండు డిఫరెంట్ లుక్‌లలో సుశాంత్ అనుమోలు కొత్త సినిమా పోస్టర్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments