Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీషియన్ శిరీష పెదవులపై పంటిగాట్లు, ఎస్సై రేప్ చేశాడా? ఆరోజు రాత్రి ఏం జరిగింది?

హైదరాబాద్ షేక్‌పేట్‌లో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న శిరీష ఆత్మహత్యలో కొత్తకోణాలు వెలికివస్తున్నాయి. కుకునూరుపల్లి ఎస్సై మధ్యాహ్నం ఒంటిగంటకు ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యకు లింకున్నట్లు వార్తలు

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (18:31 IST)
హైదరాబాద్ షేక్‌పేట్‌లో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న శిరీష ఆత్మహత్యలో కొత్తకోణాలు వెలికివస్తున్నాయి. కుకునూరుపల్లి ఎస్సై మధ్యాహ్నం ఒంటిగంటకు ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యకు లింకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వివాదంపై శిరీష టీమ్ కుకునూరుపల్లి ఎస్సై వద్దకు వెళ్లారు. ఆ క్రమంలో వారు అక్కడ మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులో గొడవలు జరిగినట్లు సమాచారం. 
 
ఆ పంచాయతీ తెల్లవారు జాము 3 గంటల వరకూ జరిగినట్లు తెలుస్తోంది. అదలా సాగుతుండగానే ఎస్సై మద్యం మత్తులో శిరీషపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేని శిరీష తిరుగు ప్రయాణంలో కారులో నుంచి దూకేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఐతే చివరికి ఆమె తన కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని శిరీష తన స్నేహితురాలితో పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీషతో పాటుగా కుకునూరుపల్లి వెళ్లిన రాజీవ్, శ్రావణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి కీలక సమాచారం రావడంతో, ఇందులో ఎస్సై దోషిగా నిలబడక తప్పదని తేలడంతో ప్రభాకర్ రెడ్డి భయంతో తన సర్వీస్ రివాల్వరుతో సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.
 
మరోవైపు శిరీష మృతదేహాన్ని పరిశీలించినప్పుడు ఆమె పెదవులపై, మెడపై పంటిగాట్లు వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పడం చూస్తుంటే అది హత్యేనేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌, అతడి స్నేహితుడు శ్రావణ్ పాత్ర ఏమిటన్నది తేలాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments