Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నీతో ఉండలేను.. భర్త పిల్లలే నాకు ముఖ్యం.. ప్రియుడికి చెప్పిన వివాహిత.. సూసైడ్

ఓ వివాహిత తన ప్రియుడికి దూరంకావాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడు ప్రియురాలి ఎడబాటును భరించలేనని భావించి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఆత్మహత్య.

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (09:20 IST)
ఓ వివాహిత తన ప్రియుడికి దూరంకావాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడు ప్రియురాలి ఎడబాటును భరించలేనని భావించి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఆత్మహత్య. ఈ వివరాలను పరిశీలిస్తే..మెదక్ జిల్లా పరిధిలోని కోటిపల్లి-చినపులివర్రు రహదారి మధ్యనున్న డొంకలో భట్టిప్రోలు మండలం వెల్లటూరు కొత్తకాలనీకి చెందిన పొట్లూరి ప్రభుదాసు (23) బుధవారం రాత్రి పురుగుల మందు తాగడంతో రాటు తుమ్మ చెట్టుకు ఉరేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు యువకుడు వివరాలను సేకరించి తల్లిదండ్రులను విచారించారు. విచారణలో ప్రభుదాసుకు ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. 
 
కానీ ఆ వివాహిత ప్రభుదాసును పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుదాసు బెంగళూరులో అక్కబావల దగ్గరకు వెళ్లి నివాసం ఉండటంతో,  ఐదు రోజుల క్రితం తన పిల్లలను హాస్టల్‌ చేర్పించే విషయం మాట్లాడి వస్తానని చెప్పి ఆ వివాహిత బెంగళూరు వెళ్లింది. అక్కడ ప్రభుదాసును కలిసిన ఆ మహిళ, ఇకపై తన భర్త, పిల్లలతో ఉంటానని చెప్పడంతో మనస్తాపం చెందిన యువకుడు సమీపంలోని కోటిపల్లి - చినపులివర్రు డొంక మార్గంలో పురుగుల మందు సేవించడంతో పాటు ఉరి వేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments