Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌జన్ల పొలిటికల్ హీరో కెటిఆర్... కేసీఆర్ కంటే వెనుకబడ్డ చంద్రబాబు

ప్రపంచం వ్యాప్తంగా ఉన్న నెట్ జనులు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నాయకులలో ఎవరిని గూర్చి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారని నిర్వహించిన సర్వేలో కెసిఆర్ తనయుడు కెటిఆర్ ముందంజలో ఉన్నారు. నెట్‌లో యూజర్లు ఎక్కువసార్లు సెర్చ్ చేసిన పేర్లలో కేసీఆర్ పేరు నిన

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (13:28 IST)
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న నెట్ జనులు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నాయకులలో ఎవరిని గూర్చి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారని నిర్వహించిన సర్వేలో కెసిఆర్ తనయుడు కెటిఆర్ ముందంజలో ఉన్నారు. నెట్‌లో యూజర్లు ఎక్కువసార్లు సెర్చ్ చేసిన పేర్లలో కేసీఆర్ పేరు నిన్నమొన్నటి వరకూ ముందుండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కేటీఆర్ పేరు తండ్రి పేరు కంటే ఎక్కువ సార్లు నెట్‌జన్లు సెర్చ్ చేసిన లిస్ట్‌లో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది.
 
కేటీఆర్, కేటీఆర్ తెలంగాణ, కేటీఆర్ మినిస్టర్, కేటీఆర్ హైద్రాబాద్ అనే పేర్లతో గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ నెటిజన్ల సెర్చ్‌లో ముందున్నారట. కేసీఆర్ స్పీచ్ అనే కీ వర్డ్ కేసీఆర్ గురించి సెర్చ్ చేసిన జాబితాలో టాప్‌లో ఉందట. కేటీఆర్ లైమ్‌లైట్‌లోకి రాగానే కేసీఆర్ ప్రభ తగ్గిందని ఈ సర్వేలో తేలింది. 
 
ఇక ఏపీ విషయానికొస్తే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూగుల్ సెర్చ్‌లో వెనుకబడ్డారు. 2014 ఎన్నికల తర్వాత జగన్ హవా ఒక్కసారిగా పడిపోయింది. 2015 జూన్‌లో చంద్రబాబు రాజధానికి భూమి పూజ చేసిన సమయంలో జగన్ హవా ఉన్నట్టుండి పెరిగింది. జగన్ రాజధాని భూమి పూజకు వస్తారా లేదా అన్న డైలమానే నెట్‌లో సెర్చ్ చేయడానికి కారణంగా తెలుస్తోంది. జగన్ తర్వాత అతని గురించి సెర్చ్ చేసిన వివరాలలో ఆయన బెంగళూరు ఇల్లు ఉండటం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments