Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం కట్టింది విద్యుత్ ఉత్పత్తి కోసమే... మంత్రి కేటీఆర్ వ్యాఖ్య

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (19:11 IST)
శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది విద్యుత్ ఉత్పత్తి కోసమేనని తెలంగాణ మంత్రి కెటీఆర్ అన్నారు. ప్రాజెక్టులో 834 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని జీవోలో ఉన్నదని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1996 సంవత్సరంలో జీవో నెం. 69 విడుదల చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. అవసరమైతే దేవినేనికి జీవో కాపీ పంపిస్తామని కేటీఆర్ తెలిపారు.
 
కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 69,107 జీవోలు అర్ధం కాలేదని, అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆ రెండు జీవోలు పాటిస్తామని రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డు వద్ద ఒప్పుకున్నాయని పరకాల తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన మాటలను మీరుతున్నారని, విపరీత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. 
 
కేసీఆర్ మాటలు మీరుతున్నారని హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేవలం తెలుగు ప్రజలను తప్పుదోవపట్టించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమే సవాళ్లు అని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments