Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ అప్పుల అప్పారావు: బీజేపీ

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:20 IST)
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్‌ని అబద్ధాలకు అంబాసిడర్‌ను చేయాలన్నారు. అప్పును కూడా ఆదాయంగా చూపిన ఘనత

కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్.. అప్పుల అప్పారావుగా మారారంటూ విమర్శలు గుప్పించారు. అనేక అంశాలపై కాగ్ రిపోర్ట్.. ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగానికి కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లు ఇచ్చిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఏనాడూ కోరలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని దుమ్మెత్తిపోశారు.

1990లోనే తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేసిందని లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రొఫెసర్ జయశంకర్‌ని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర కేసీఆర్‌ది అని ధ్వజమెత్తారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోదండరాంను అవమానించారని అన్నారు. తెలంగాణలో త్వరలోనే కల్వకుంట్ల పాలన పోయి బీజేపీ పాలన వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పాలన టీఆర్ఎస్‌ది అయినా.. ఎంఐఎం అజెండా కొనసాగుతోందన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను పీఏసీ చైర్మన్‌గా చేయడం అనైతికం అని ప్రభుత్వ విధానాలను లక్ష్మణ్ తీవ్రంగా తప్పుపట్టారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments