ఎన్నికలంటే.. కొన్ని పార్టీలకు గేమ్.. టీఆర్ఎస్‌కి మాత్రం టాస్క్- కేసీఆర్

ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక మేనిఫెస్టోను రూపొందించారు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (12:57 IST)
ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఆసరా పెన్షన్లను రూ.2,016గా పెంచుతామని చెప్పారు. అంతేగాకుండా.. 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్‌ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పెన్షన్లు రూ.3,016 అందిస్తామన్నారు. 
 
ఇక నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తామని చెప్పి, ప్రతిపక్షాల కంటే, ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామని చెప్పకనే చెప్పారు. సొంత స్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు గేమ్‌లాంటిదని, టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం టాస్క్‌ వంటిదన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెప్తామని తెలిపారు. 
 
కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింతగా బయటకు లాగుతామని చెప్పారు. చంద్రబాబు వచ్చి, ఆంధ్రా-తెలంగాణ గొడవలు పెడదామనుకుంటున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణలో ఉన్నవాళ్లంతా, తెలంగాణవారేనని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

రిషికేష్‌కు రజినీకాంత్, రోడ్డు పక్కన రాతి బెంచీపై ప్లేటులో భోజనం చేస్తూ...

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments