Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైరవీకారుల పని పట్టిన సీఎం... కానీ ఇదెన్నాళ్లు అంటున్న సభ్య సమాజం

తన కళ్లముందే ఉద్యమకారుల నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగివచ్చిన వారు పైరవీలే బతుకు మార్గంగా చేసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చిర్రెత్తుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో, ఆ తర్వాత కూడా కొద్దిరోజులపాటు నేతల పైరవీల విషయంలో పచ్చజెండ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (07:59 IST)
తన కళ్లముందే ఉద్యమకారుల నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగివచ్చిన వారు పైరవీలే బతుకు మార్గంగా చేసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చిర్రెత్తుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో, ఆ తర్వాత కూడా కొద్దిరోజులపాటు నేతల పైరవీల విషయంలో పచ్చజెండా ఊపిన సీఎం కేసీఆర్‌...రానురానూ వారి వ్యవహా రం శ్రుతిమించడంతో సీరియస్‌గానే స్పందించారని తెలిసింది. ఇటీవల తన వద్దకు పనుల కోసం వచ్చిన కొందరు నాయకులకు సీఎం ఝలక్‌ ఇచ్చారని సమాచారం. రాజకీ యాలు కావాలో లేక వ్యాపారాలు కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు! 
 
తమ ప్రభుత్వంలో రాజకీయ అవినీతిని రూపుమాపామని సీఎం కేసీఆర్‌ గత మూడేళ్లుగా వివిధ సందర్భాల్లో ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో కొందరు నిత్యం పైరవీల్లో మునిగి ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొందరు నాయకులు తమ వ్యాపారాల కోసం, తమ వర్గం వారి కోసం నిత్యం ఏదో ఒక పనిని సీఎం దగ్గరకు తీసుకువెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. వివిధ శాఖల్లో మంత్రుల స్థాయిలో కుదరని ‘పనుల’ను సదరు నేతలు సందర్భం చిక్కినప్పుడల్లా సీఎం వద్దకు సిఫారసులు తీసుకుపోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
 
పార్టీ ఎంపీ ఒకరు సీఎంను కలిసే ప్రతి సందర్భంలోనూ బదిలీల ఫైళ్లు పట్టుకు వెళ్లేవారని, మొదట్లో సదరు ఎంపీ పనుల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం... ఆ తర్వాత అనుమానం వచ్చి సదరు బదిలీల సిఫారసులను పరిశీలిం చారని తెలిసింది. ఆ ఎంపీ బదిలీల సిఫా రసులన్నీ ఒకే కులానికి చెంది ఉండడాన్ని గమనించి ఆ తర్వాత నుంచి ఆ ఎంపీని పక్కనపెట్టారని చెబుతున్నారు. అలాగే గత మూడేళ్లుగా విద్యా రంగ పైరవీలు సాగి స్తున్న ఓ ఎమ్మెల్సీ ఇటీవల మరోసారి అదే పనిపై సీఎం వద్దకు వెళ్లారని, ఈ సమయంలోనే ‘నీకు రాజకీయాలు కావాలా లేక విద్యా వ్యాపారం కావాలా’ తేల్చు కోవాలని ముఖ్యమంత్రి తీవ్రంగానే చెప్పారని వినికిడి.
 
కొందరు ఎమ్మెల్యేలు సైతం పైరవీలు చేస్తుండగా సదరు ఎమ్మెల్యేలకు సీఎం కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. మొదట్లో నిత్యం సీఎం అధికారిక నివాసంలో తచ్చాడిన ఓ ఎమ్మెల్యేను కూడా పూర్తిగా పక్కన పెట్టారు. చివరకు తన అపాయింట్‌మెంట్‌ లేకుండా ప్రగతి భవన్‌కు ఎవరూ రావొ ద్దని, నేతలంతా ఉండాల్సింది నియోజక వర్గాల్లో తప్ప తన చుట్టూ కాదని సీఎం చెప్పారని సమాచారం. దీంతో పైరవీల ఫైళ్లతో తిరిగే నేతలకు చెక్‌ పెట్టినట్టయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
అధికార టీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు పదేపదే సాగిస్తున్న పైరవీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు!  వినడానికి ఇది బాగానే ఉంది. కానీ పైరవీకారులపై సీఎం మొదలెట్టిన దాడి ఎన్నాళ్లు ఉంటుంది అని తెరాస నేతలే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే పైరవీ అనేది రాజకీయం ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుందని వారికి తెలీదా మరి.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments