Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతంలోకి విష్ణువర్ధన్ రెడ్డి : బెంగళూరులో ఫ్రెండ్ ఇంట్లో ఆశ్రయం!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:17 IST)
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి, ఆయన అంగరక్షకుడిపై దాడి చేసిన కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌ రెడ్డిని ఎలాగైనా శుక్రవారం అరెస్టు చేయాలన్న పట్టుదలతో హైదరాబాద్ సిటీ పోలీసులు ఉన్నారు. గురువారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా, విష్ణు తన రెండు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి... అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. దీనిపై పోలీసులు ఆరా తీయగా.. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని తన స్నేహితుని ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం. 
 
ఇదిలావుంటే రంగారెడ్డి కోర్టులో విష్ణు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. విష్ణుకు బెయిల్ రాకుంటే, ఆయన పరారీలో ఉన్నట్టు ప్రకటించి, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 37 మంది సాక్ష్యులను ప్రశ్నించారు. 
 
ఈ నెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments