Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని జైళ్లు మూడు నెలల్లో క్లీన్!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (07:37 IST)
తెలంగాణా రాష్ట్రంలోని జైళ్లను మూడు నెలల్లోగా అవినీతిరహితంగా మార్చివేస్తామని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ ప్రకటించారు. ఇందుకోసం నాలుగు దశల్లో ఒక ప్రత్యేక విధానాన్ని అమలుపరచనున్నట్టు చెప్పారు. ఈ విధానం అమలయ్యేలోగా జైళ్ల శాఖ సిబ్బంది తీరు మారకుంటే అందుకు తానే పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని మహాత్ముడి సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జైళ్లలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించనున్నట్టు తెలిపారు. ప్రతిజ్ఞ, కౌన్సిలింగ్, హెచ్చరికలు ఇలా తొలి మూడు దశల్లోనూ సిబ్బంది తీరు మార్చుకోకుంటే, నాలుగో దశలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్కరణల ద్వారా తెలంగాణ జైళ్లను ఆధునీకరించి దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని జైళ్లలో జామర్లు ఏర్పాటు చేసి జైళ్ళలోకి మొబైల్ ఫోన్స్ వెళ్లకుండా చేస్తామన్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments