Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ అహంకారానికి అది సంకేతం... కిషన్ రెడ్డి

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (20:17 IST)
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. కేటీఆర్ ఎవరో తెలియదని తాము కూడా అనొచ్చని.. కానీ తమకు సభ్యత అడ్డొస్తోందని అన్నారు.

కేటీఆర్ అహంకారానికి అది సంకేతం అన్నారాయన. నడ్డా ఎవరో తెలియదని చెప్పిన కేటీఆర్.. గతంలో ఎలా కలిశారో చెప్పాలన్నారు. తెలంగాణలో బీజేపీ లేదని కేటీఆర్ అన్నాడనీ.. ఐతే నిజామాబాద్ లో కవిత ఎలా ఓడిపోయిందో చెప్పాలన్నారు. సుష్మ స్వరాజ్ చనిపోతే కనీసం చూడని వ్యక్తులు ఇపుడు మాట్లాడుతున్నారని అన్నారు. 
 
ఏపీ రాజధాని మారుతుందన్న విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని అన్నారు కిషన్ రెడ్డి. అది కేంద్రం పరిధిలోకి రాదన్నారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.

ఆయుష్మాన్ భవ బక్వాస్ అన్న టీఆర్ఎస్ నాయకుల దృష్టిలో ఆరోగ్యశ్రీ మంచిదైనప్పుడు.. ధర్నాలు ఎందుకు చేస్తున్నారో వివరించి చెప్పాలన్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని కిషన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments