భాగ్యనగరిలో తొలి లిక్కర్ అలెర్జీ కేసు నమోదు

Webdunia
బుధవారం, 17 మే 2023 (16:40 IST)
హైదరాబాద్ నగరంలో తొలి లిక్కర్ అలెర్జీ కేసు నమోదైంది. ఈ తరహా కేసులు నమోదుకావడం ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ తరహా లిక్కర్ అలెర్జీ కేసును వైద్యులు గుర్తించారు. ఆగ్రాకు చెందిన జాన్ (36) అనే వ్యక్తికి మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆయన ముఖం ఎర్రబడటంతో వైద్యులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఆయన నగరంలోని ఓ ప్రైవేటు అలెర్జీ సెంటర్‌కు చికిత్స కోసం వెళ్లగా, ఈ అలెర్జీ కేసు వెలుగు చూసింది. ఆయన్ను పరిశీలించిన వైద్యుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ లిక్కర్ అలెర్జీగా గుర్తించారు. ఈ తరహా కేసులు ప్రపంచ వ్యాప్తంగా మహా అయితే, వంద వరకు ఉండొచ్చని తెలిపారు. 
 
అయితే, జాన్‌కు ఈ అలెర్జీ రావడానికి కారణాలను విశ్లేషిస్తే, కొన్ని నెలల క్రితం జాన్ ఓ విందు పార్టీకి వెళ్లి అక్కడ మద్యం సేవించాడు. ఆ తర్వాత ముఖంపై వేడిగా ఉండటంతో అద్దంలో చూసుకోగా, ఎర్రబడినట్టు కనిపిచింది. చర్మంపై దురదలు, ఛాతీ పట్టేసినట్టు అనిపించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్సతో నయం చేసుకున్నాడు. కొంతకాలానికి మళ్లీ మద్యం సేవించడంతో తిరిగి అదే సమస్య ఉత్పన్నమైంది. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చి అశ్విని అలెర్జీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయగా, అలెర్జీ కేసుగా నమోదైంది. మద్యం సేవించిన తర్వాత ఈ తరహా అలెర్జీలు కనిపిస్తే తాగకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments