Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (21:47 IST)
రూ. 2 వేలు నోట్లు ఇస్తే రెండు రోజుల్లో రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసారు. యాదగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురంలో ఐలయ్య అనే వ్యక్తి నుంచి గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు రూ.12 లక్షలు వసూలు చేసారు. ఈ నగదును ఈనెల 21వ తేదీన తీసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్నీ సంచిలో ఉంచితే రెండు రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించారు. రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...
 
అయితే నిందితులు ఐలయ్యను మోసం చేసారు. ఆ సంచిలో తెల్ల కాగితాలు ఉంచి, నగదును పట్టుకెళ్లిపోయారు. బాధితుడు రెండు రోజుల తర్వాత సంచి తెరిచి చూసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యాడు. అందులో ఉన్న తెల్ల కాగితాలను చూసి ఐలయ్య షాక్‌కు గురైయ్యాడు. తాను మోసపోయాడని గ్రహించిన ఐలయ్య పోలీసులను ఆశ్రయించాడు. 
 
గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు తనను మోసం చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షేక్‌ నైదా అనే నిందితుడిని అరెస్టు చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడైన నైదా నుండి పోలీసులు రూ.12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments