మద్యంలో విషం కలిపి భర్తకు ఇచ్చిన భార్య... ప్రియుడితో కలిసి ప్లాన్

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (15:44 IST)
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్యే తన ప్రియుడుతో కలిసి మద్యంలో విషం కలిపిచ్చి చంపేసింది. మృతుడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చైతన్యపురికి చెందిన 33 యేళ్ల వ్యక్తి ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చేరవేశారు. అయితే, మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైనశైలిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 
 
మృతి చెందిన వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మంచి స్నేహితుడు. ఈయన ఇంటికి వస్తూపోతూ హతుడి భార్యతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. ఈ విషయం హతుడుకి తెలియడంతో ఆయన వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో తన భర్తకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో తన ప్రియుడుతో కలిసి ఆ మహిళ హత్యకు ప్లాన్ చేసింది. శనివారం రాత్రి మద్యంలో విషం కలిపి ఇచ్చింది. ఇది సేవించిన ఆ వ్యక్తి అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ముక్కు, నోటిపై దిండుతో అదిమిపట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేశారు. 
 
మరసటి రోజు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో హుతుడు భార్యతో పాటు ఆమె ప్రియుడుని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments