Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ రవీంద్రకు కరోనా

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా వైరస్ సోకింది. స్టీఫెన్ రవీంద్ర సోమవారం కరోనా టెస్టు చేయించుకోగా, పాజిటివ్ అంటూ మంగళవారం నివేదిక వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 
 
స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయనను గతం వారం రోజుల్లో కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వ్యవహరించారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా స్టీఫెన్ రవీంద్రను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర బదిలీకి తెలంగాణ ప్రభుత్వం సమ్మతి తెలిపింది. కానీ, కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖకు ఏపీ సర్కారు పలు దఫాలుగా లేఖలు రాసినప్పటికీ.. ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. 

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments