ప్రాణాలు తీసిన సెల్ఫీ.. క్వారీ గుంతలో పడి...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెల్ఫీ ముగ్గురి ప్రాణాలు తీసింది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో జారిపడి జలసమాధి అయ్యారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బోరబండకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పీఎన్ సూర్య (20), సోదరుడు పీఎన్ చంద్ర (16) భార్గవ్ (17), సయ్యద్ ఉవేజ్, సంవీత్‌తో కలిసి కొత్వాల్‌గూడ సమావేశంలోని మానసహిల్స్ క్వారీకి ఆదివారం వచ్చారు. క్వారీ నీటి గుంతల వద్ద తిరుగాడుతూ సెల్ఫీలు దిగుతూ కొద్దిసేపు ఉత్సాహంగా గడిపారు. 
 
ఇంతలో సోదరులు సూర్య, చంద్రతోపాటు మరో విద్యార్థి భార్గవ్ సెల్ఫీ దిగేక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడం వల్లే మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే ఉన్న మిగతా ఇద్దరు ఘటన వివరాలను మృతుల కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్టీఐఏ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments