Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనొక అమ్మాయిని లవ్ చేశారు.. ఫ్రెండ్స్‌, ఆమె మోసం చేశారు.. చనిపోతున్నా...

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (12:07 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి తన ప్రియురాలితో పాటు.. స్నేహితుల చేతిలో మోసపోయాడు. దీంతో ఇక జీవించడం వృథా అనుకుని లైవ్‌లో ఉరివేసుకున్నాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరం వనస్థలిపురం, ముండ్లమూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముండ్లమూరు మండలం, పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం (36) లారీ యజమాని. ఇతనికి భార్య ఖాసీంబి, కుమారుడు (10), కుమార్తె (8) ఉన్నారు. 
 
ఆర్థికంగా నష్టపోయిన అతను శనివారం ఉదయం తన స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం వీఎంఆర్‌ లాడ్జ్‌ అండ్‌ బార్‌లో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇద్దరు కలిసి మద్యం తాగి గదికి వెళ్లి పడుకున్నారు. 
 
తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం తాగుతుండగా.. షేక్‌ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ తాను ప్రేమించి మోసపోయానని, స్నేహితులూ మోసం చేశారని, చనిపోతున్నానంటూ సీలింగ్‌ ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకున్నాడు. 
 
తన స్నేహితుడు ఎంతకీ కిందకు రాకపోవడంతో వేణుగోపాల్ ఫోన్‌ చేశాడు.. స్పందించకపోవడంతో గదికి వెళ్లాడు. కిటికిలోంచి చూసే సరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. సిబ్బంది గది తలుపులు తెరిచి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments