Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుడుకు అలవాటుపడి.. అన్నయ్య తండ్రిని చంపేస్తే.. చెల్లాయి.. కన్నతల్లిని కర్రతో కొట్టి చంపేసింది..

సాధారణంగా పురుషులే మద్యానికి అలవాటుపడుతారు. పురుషుల తాగడానికి డబ్బులివ్వమని.. తల్లి వద్ద భార్య వద్ద గొడవపడుతుంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మద్యానికి బానిస అయిన ఓ మహిళ కన్నతల్లినే హతమార్చి

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (17:08 IST)
సాధారణంగా పురుషులే మద్యానికి అలవాటుపడుతారు. పురుషుల తాగడానికి డబ్బులివ్వమని.. తల్లి వద్ద భార్య వద్ద గొడవపడుతుంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మద్యానికి బానిస అయిన ఓ మహిళ కన్నతల్లినే హతమార్చింది. అంతేగాకుండా తల్లి శవంతోనే వారం రోజులు గడిపింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్ పేట్ మండలం ఇప్పతూరు గ్రామానికి చెందిన నర్సమ్మ (70)కు పార్వతమ్మ అనే కుమార్తె ఉండేది. ఈమె మద్యానికి అలవాటుపడి.. తాగేందుకు డబ్బులివ్వలేదని కన్నతల్లినే హతమార్చింది. వారంరోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. హతమార్చిన ఐదో రోజున తల్లి శవాన్ని తరలిస్తుండగా... స్థానికులు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  
 
ఇకపోతే.. కాగా, నాలుగేళ్ల క్రితం ఇదే ఇంట్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మద్యానికి బానిసైన నర్సమ్మ పెద్ద కొడుకు సైతం తాగడానికి డబ్బులివ్వలేదన్న కారణంతో తండ్రిని హత్య చేశాడు. కాగా, మద్యానికి బానిసవడం వల్ల పార్వతమ్మ వైవాహిక జీవితం కూడా దెబ్బతిన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు అయినా.. తాగుడుతో పుట్టింటికే పరిమితం అయ్యింది. 
 
వారం రోజుల క్రితం నర్సమ్మ తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కర్రతో ఆమె తలపై కొట్టింది. ఈ దాడిలో నర్సమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్తున్నారు. ఈ నేరాన్ని నర్సమ్మ కూడా ఒప్పేసుకుందని పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments